మంచి వక్తగా రూపొందడానికి ఒక సులభమైన మార్గం…
చక్కగా వినండి.ఎదుటివారిని తమ గురించి చెప్పమని ప్రోత్సహించండి !!!
ఐజాక్ ఎఫ్.మార్కోసన్ అనే పత్రికా రచయిత కొన్ని వందలమంది ప్రసిద్ధ వ్యక్తులని ఇంటర్వ్యూ చేసాడు.చాలా మంది, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినకపోవటం వల్లే ఎదుటివారి మెప్పు పొందలేక పోతారు, అని బల్లగుద్ది మరీ చెప్పాడు. “అవతలి వ్యక్తి మాటలకి తామేం సమాధానం చెప్పాలా అని ఆలోచించటం మూలాన్నే వీరు చెవి వొగ్గి ఇతరులు చెప్పేది వినరు…చాలా గొప్ప వ్యక్తులు నాకు చెప్పినదేమంటే, మాకు చక్కగా మాట్లాడేవారికన్నా, చక్కగా వినేవాళ్ళే ఇక్కువ ఇష్టం అని.కాని శ్రద్ధగా వినటం అనేది మిగతా మంచి లక్షణాల్లాగే చాలా తక్కువ మందిలో ఉంటుందనుకుంటాను”
సౌజన్యం: “డేల్ కార్నెగీ” వ్రాసిన How to win friends & Influence people అనే ప్రపంచప్రఖ్యాతి గాంచిన వ్యక్తిత్వవికాస పుస్తకం తెలుగు అనువాదం పుట 111 నుండి తీసుకోబడింది.




















































